మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అనంతరం గురువారం ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తల్లుల దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిణి రమాదేవి, రెవెన్యూ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.