============================
వందల కోట్ల ఆస్తి వుందని నమ్మించి పెళ్ళి చేసుకున్న వ్యక్తి కాణికి గతి లేదని తెలిసి విడాకులు ఇచ్చేసింది. ఎనిమిది నెలల క్రితం కుకి అనే మహిళ ఓ వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. ప్రైవేట్ విమానం వుందని, ఎక్స్ పోర్ట్ బిజినెస్ వుందని సదరు వ్యక్తి ఆమెను నమ్మించాడు.

పెళ్ళి థాయ్ లాండ్ లోని గురిరమ్ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగింది. పెళ్ళికి కోటి రూపాయల వరకు ఖర్చు కాగా 35 లక్షల రూపాయలు పెళ్ళి కొడుకుకి కట్న కానుకలు ఇచ్చారు. పెళ్ళయిన తర్వాత మరుసటి రోజే పెళ్ళి కొడుకు పరారయ్యాడు.

గత ఎనిమిది నెలలుగా అతని కోసం వెతికి తాను మోసపోయానని గ్రహించి ఇప్పుడు విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. పెళ్ళి కారణంగా కోట్ల రూపాయలు అప్పుల పాలయ్యానని కుకి ఇప్పుడు ఏడుస్తోంది.