చెల్లెలు జీవితాన్ని చిదిమేయాలని చూసిన కన్నతల్లిని కడతేర్చాడు కుమారుడు. తల్లి మెడకు చీరతో ఉరి బిగించి హత్య చేశాడు, పోలీసుల వివరాల ప్రకారం: ఎల్లమ్మ బండకు చెందిన సురేష్‌ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌. భార్య, తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సురేష్‌ తల్లి మల్లమ్మ (40) చెడు సావాసాలకు అలవాటు పడింది. తండ్రి మద్యానికి బానిసగా మారి భిక్షటన చేస్తుంటాడు. డబ్బులు సంపాదించాలనే ఆశతో మల్లమ్మ తన మైనర్‌ కుమార్తెను కూడా చెడు మార్గంలోకి దింపాలని చూసింది. ఈ విషయమై పలుమార్లు సురేష్‌ తన తల్లిని మందలించాడు. అయినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఆదివారం తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. సురేష్‌ ఆగ్రహంతో మల్లమ్మ గొంతుకు చీరతో ఉరి బిగించి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.