కూతురు పెళ్లికి రాలేనన్న తల్లి అవాక్కైన కూతురు.! అమ్మ సమాధానం విని షాక్ | అలా గతంలోకి వెళ్లి ఆలోచిస్తే…

జీవితంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి, కొందరికి అనుకోని అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. ఈ అమ్మాయికి కూడ ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది వివరాల్లోకి వెళితే: ఏ తల్లి అయినా తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని కోరుకుంటుంది. తన కూతురు భర్తతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. తన తల్లి కూడా అదే కోరుకుంటుందని ఆ అమ్మాయి భావించింది. తాను కోరుకున్న వ్యక్తిని పెళ్లాడేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఆ అమ్మాయి. పెళ్లి గురించి సమాచారాన్ని తన తల్లికి చెప్పి ఆమె కళ్లల్లో ఆనందం చూడాలని భావించింది. పెళ్లి గురించి చెప్పి, తన పెళ్లికి రావాలని కోరింది. కానీ కూతురు పెళ్లి గురించిన వార్త విన్న ఆ తల్లి తాను ఈ పెళ్లికి రాలేనని తెలిపింది. ఈ మాట విన్న కూతురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కూతురు పెళ్లికి తల్లి రానని చెప్పడం ఏంటని నివ్వెరపోయింది. తాను విన్నది నిజమేనా అని తనతో తాను చర్చించుకుంది. అయితే తన తల్లి పదే పదే అదే మాట చెప్పడంతో కూతురికి ఏమీ అర్థంకాలేదు. కూతురి పెళ్లికి రాలేనంత కష్టం, ఇబ్బంది తన తల్లికి ఏముందో ఆమెకు అర్థంకాలేదు. తన పెళ్లికి ఎందుకు రానంటున్నావో చెప్పాలంటే పదే పదే తల్లిని ప్రశ్నించింది. అయితే ఇందుకు ఆ తల్లి నుంచి సమాధానం రాలేదు. అయితే కూతురు మాత్రం ఈ విషయంలో సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన తల్లిని వదిలిపెట్టలేదు.

దీంతో చివరకు తాను ఎందుకు కూతురు పెళ్లికి రానని అంటుందో చెప్పింది ఆ తల్లి. అయితే ఆ కారణం విన్న కూతురికి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైపోయింది. కాళ్ల కింద భూమి కంపించినట్టు అనిపించింది. కూతురికి కాబోయే వ్యక్తిని తాను ప్రేమిస్తున్నానని అందుకే ఈ పెళ్లికి రాలేనని ఆమె సమాధానం చెప్పడం ఈ మొత్తం కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్. అయితే తల్లి ఈ విషయం చెప్పిన తరువాత కూతురికి కొన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి. తాను లేని సమయంలో కూడా తన తల్లి తనకు కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లిందని అతడితో కలిసి టెన్నిస్ కూడా ఆడిందని ఆమెకు తెలిసింది. అయితే తన తల్లితో అతడికి ఏమైనా వివాహేతర సంబంధం ఉందా.? అని కాబోయే భర్తను యువతి ప్రశ్నించింది. అయితే తనకు అలాంటి సంబంధం ఏమీ లేదని అతడు ప్రమాణం చేసి చెప్పాడు. దీంతో తన తల్లి మరీ ఈ రకంగా ఆలోచిస్తుందా.? అని ఆమె కూతురు మౌనంగా రోదించింది. పెళ్లి చేసుకుని తల్లి నుంచి దూరంగా వెళ్లితానని సోషల్ మీడియాలో తెలిపింది..