తండ్రిని హత్యచెయ్యాలని ప్రియుడితో కలిసి తల్లి పన్నిన కుట్రను ఓ కూతురు పసిగట్టి , సాక్ష్యాధారాలతో పోలీసులకు పట్టించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట సంఘం కాలనీకి చెందిన మహిళతో సతీష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆమె భర్తకు తెలియడంతో పలుమార్లు ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న ఆమె భర్తను తొలగించుకోవాలని, ఆమెతోకలిసి కుట్ర పన్నాడు. దీని కోసం అతని స్నేహితుడు ప్రతాప్ సాయం కోరాడు. అతని సలహా మేరకు ఆహారంలో స్లో పాయిజన్ ఇచ్చేందుకు పథకానికి ప్రణాళిక రచించాడు.

అయితే తల్లి వ్యవహారంపై అప్పటికే అనుమానం వచ్చిన చిన్న కూతురు ఆమె ఫోన్ కాల్స్‌‌ రికార్డు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే హత్య పథకం బయటపడింది. తండ్రిని హత్య చేసేందుకు సతీష్‌తో కలిసి తల్లి కుట్ర పన్నిందన్న విషయం కూతురు తండ్రికిచెప్పి పోలీసులకు ఫోన్ రికార్డింగ్ వివరాలు ఇచ్చింది. . అనంతరం మహిళ భర్త మండపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.