కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ సినీ నటిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ వీడియోలను బయటపెడుతానని బెదిరిస్తూ డబ్బులు లాగుతున్న సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: 2018లో మోహిత్ అనే వ్యక్తి తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ను పరిచయం చేసుకున్నాడు. ఓ కంపెనీ సిఇఒ అని చెప్పి ఆమెతో స్నేహం చేయడమే కాకుండా ఆ హీరోయిన్ ప్రచార రాయబారిగా ఉన్నాడు. 2019 జూన్ 22న తన ఇంట్లో బర్త్ డే పార్టీ ఉందని ఆమెను ఆహ్వానించాడు. జూన్ 23 ఆమెది బర్త్ డే కావడంతో ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి వీడియో తీశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి ఆమె నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. ఇలా నటి నుంచి 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ విషయం మోహిత్ తల్లిదండ్రులకు ఆమె చెప్పడంతో వాళ్లు కూడా కుమారుడికి బాసటగా నిలిచారు. దీంతో మోసపోయినని గమనించిన ఆమె స్థానికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మోహిత్ పరారీలో ఉన్నాడు. మోహిత్ కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.