తెలంగాణ రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమములో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మించిన అర్బన్ పార్కును ప్రారంభించి మొక్కలు నాటడం జరిగినది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోవిడత హరితహారం కార్యక్రమమునకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్య అధితి గా విచ్చేసి జిల్లాలోని నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మించిన అర్బన్ పార్కును ప్రారంభించి తదుపరి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగినది జిల్లా ఎస్.పి. గారు తెలిపారు.

గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ పర్యటనలో మొత్తం 1083 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పటిష్టమైన పోలీస్ బందోబస్తు వెస్ట్ జోన్ ఐ.జి. శ్రీ స్టీఫెన్ రవీంద్ర ఐ.పి.ఎస్ గారు, నిజామాబాద్ రేంజ్ ఐ.జి. శివ శంకర్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు,సంగారెడ్డి జిల్లా ఎస్.పి. శ్రీ. చంద్రశేకర్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు, మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్ గార్ల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా పోలీస్ బందోబస్తు నిర్వహించడం జరిగినది జిల్లా ఎస్.పి. గారు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగేసేందుకు సహకరించిన ప్రజా ప్రధినిథులకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపినారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు హరితహారంలో భాగంగా ప్రజలందరు తమ సొంత గ్రామాల్లో మొక్కలు నాటి రాబోయే సమాజానికి స్వచ్ఛమైన వాతావరణన్ని అందించేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్.పి.గారు అన్నారూ.