సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ రావు శనివారం విచారణ చేపట్టారు. పీహెచ్‌సీలో సిబ్బంది బుల్లెట్టు బండి పాటపై డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు డీఎంహెచ్ఓ తంగెళ్లపల్లి పీహెచ్‌సీలో విచారణ ప్రారంభించారు. ఈ డ్యాన్స్ చేసిన మహిళా ఉద్యోగితో పాటు పలువురికి మెమోలు జారీ చేసినట్టు సమాచారం.