కొడకండ్ల: మండలంలో లక్షక్కపల్లి గ్రామం వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సూర్యాపేట జిల్లా తిరుమలాగిరికి చెందిన సంతోష్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.