షూటింగులతో బిజీగా ఉండే తారలకు కరోనా కారణంగా ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి దొరికింది. ఇంట్లో ఖాళీగా ఉంటున్న వారంతా కుటుంబ సభ్యులతో గడుపుతూ విలువైన సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఖాళీగా ఉంటున్న తారలు, తమ రోజు వారి కార్యక్రమాలను వీడియోలు, ఫోటోలు తీస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న శిల్పా తన కొడుకుతో మసాజ్ చేయించుకున్నది.

ఇందుకు డబ్బులు ఇవ్వనని, లాక్ డౌన్ వేల అంతా వస్తుమార్పిడే అని చెప్పింది. బదులుగా తాను నీకు మసాజ్ చేస్తానంటూ కొడుకుతో అన్నది. అయితే వీరికి తెలియకుండా ఈ వీడియో శిల్పా తల్లి తీసింది. కొడుకుతో సరదాగా గడిపిన ఈ వీడియో షేర్ చేసిన శిల్పా ‘ఈ వీడియో ఎంత అఫురూపమైనదో ఇప్పుడు తనకు అర్ధమైంది’ అంటూ ఉద్వేగానికి గురైంది.