తన కన్న కొడుకుకి స్నేహితుడు, దాదాపు ఆమె కు కూడా కొడుకు లాంటివాడే, అలాంటి కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడిని రెచ్చగొట్టి, మరీ తనవైపు తిప్పుకుంది. తీరా, ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో కథ అంతా రివర్స్ అయ్యింది. ఆమెను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: నాగర్ కోవిల్ పట్టణంలోని ఆచారిపల్లెంకు చెందిన దంపతులకు పంతొమ్మిదేళ్ళ కుమారుడున్నాడు. భర్త వడ్రంగి వ్యాపారం చేస్తుంటాడు, జల్సాలకు అలవాటుపడ్డ అతని భార్య, తన కుమారునితో వచ్చే యువకుడిపై మనసుపడింది. ఈ క్రమంలో, ఆ అబ్బాయిని రెచ్చగొట్టి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అతడి ఖర్చులకు డబ్బులు ఇస్తూ మరీ తన కోర్కెలు తీర్చుకునేది. కాగా,

ఆ అబ్బాయి, ఎప్పుడుపడితే అప్పుడు వచ్చి వెళుతున్నాడని ఇంటి పక్కన వారు ఆమె భర్తకు ఫిర్యాదు చేశారు. ఓ రోజు పని మీద బయటకు వెళ్లిన భర్త ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి రాగా బెడ్ రూంలో భార్య ఒంటిపై నూలు పోగు లేకుండా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుండడం చూసి నిర్ఘాంతపోయాడు. ఆ క్రమంలోనే ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియుడు కూడా నగ్నంగా ఉండి బయటకు పరుగులు తీశాడు. అతడిపై దాడి చేయగా తప్పించుకున్నాడు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు…