తన ప్రియుడితో శృంగారం చేస్తున్న వీడియోను భర్తకు పంపి అతడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఘటన పశ్చిమబెంగాల్ లోని పురూలియాలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే జతిన్ (పేరు మార్పు) అనే యువకుడికి డోలి (పేరుమార్పు) అనే యువతితో మూడు నెలల క్రితం వివాహమైంది. అయితే డోలికి పెళ్లికి ముందే నారద్ (పేరు మార్పు) అయితే ఇష్టం లేకపోయినా జతిన్ తో పెళ్లాడింది. అయితే వివాహమైన తర్వాత కూడ ఆ యువతి ప్రియుడితో సంబంధాలు కొనసాగించింది. వివాహమైన రెండు నెలలు బాగానే ఉన్నా, ఆ తర్వాత ప్రియుడితో తన సంబంధాలను కొనసాగించడం ప్రారంభించింది. కొంత కాలం పాటు చాటు మాటుగా ఈ వ్యవహరాన్ని నడిపించిన ఆ యువతి ఆ తర్వాత యధేచ్చగా ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించింది. గత నెల పుట్టింటికి వెళ్లినప్పటిక నుంచి ప్రియుడు నారద్ తో కలిసి తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది.

ఇద్దరూ కలిసి శృంగారం చేస్తూ ఆ దృశ్యాలను రికార్డు చేసుకునేవారు. తనకు విడాకులు ఇవ్వాలని ప్రియుడు నారద్ తో కలిసి డోలీ తన భర్తను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు ప్రియుడితో కలిసి శృంగారం చేస్తున్న వీడియోలను భర్తకు వాట్సప్ ద్వారా పంపడం స్టార్ట్ చేసింది. ఆ వీడియోలు చూసి అవాక్కయిన భర్త, ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయాడు. తీవ్ర మనోవేదనకు గురైన జతిన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై ఆ జతిన్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీస్ లు యువతిని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.