హర్యానాలోని జజ్జర్ జిల్లా చమన్ పురాకు చెందిన మీనా అనే మహిళ తన వయస్సు కన్నా సగం వయస్సు ఉన్న యువకుడితో వివాహేతర బంధం పెట్టుకొని, అడ్డుగా ఉన్నాడని తెలిసి కన్న కొడుకును కడతేర్చేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే నిందితురాలు మీనా గత కొంత కాలంగా తన కుమారుడి స్నేహితుడు ప్రమోద్ తో కలిసి వివాహేతర బంధం నడుపుతోంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమోద్ కు ఫోన్ చేసి పిలిపించుకొని అతడితో తన శారీరక వాంఛలు తీర్చుకునేది. వీరిద్దరి బంధం ఎంతలా ముదిరిపోయిందంటే తనకు శారీరక సుఖం అందిస్తున్న ఆంటీ కోసం ప్రమోద్ ఏకంగా ఉద్యోగం కూడా మానేశాడు. అయితే చుట్టుపక్కల వాళ్లు ఈ తతంగం అంతా గమనించారు. ఆ నోట, ఈ నోటా ద్వారా ఈ వ్యవహారం ఆమె కుమారుడికి తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితురాలి కుమారుడు ప్రమోద్ ను తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు.

దీంతో ప్రమోద్ ఎలాగైనా మీనాతో తన బంధం కొనసాగించాలని కుట్ర పన్నాడు. ఇదే సంగతి మీనాతో కూడా చెప్పాడు. కుమారుడు అనే జాలి కూడా లేకుండా కుట్రలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమైంది. కాగా తనను హత్య చేసే కుట్ర జరుగుతుందని ముందే పసిగట్టిన నిందితురాలి కుమారుడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రమోద్ ను ఖాకీలు అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు నిజం బయటకు రాబట్టగా, కుట్ర భగ్నం అయ్యింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.