మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు ఇవ్వడం బాధకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉంటే మళ్లీ ఆయన కాంగ్రెస్ నుండి బరిలోకి దిగాలన్నారు. అలా చేస్తే కాంగ్రెస్ బీ ఫామ్ రాజగోపాల్ రెడ్డికే ఇస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

దీంతో ఎలాగైన మునుగోడును దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ కంటే ఈ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. కాంగ్రెస్ కంచుకోట అయిన మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు టీ కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.