కోవాక్సిన్ వేసుకుంటారా.? కోవిషిల్డ్ వేసుకుంటారా.? అని అడిగితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అందరు చెప్పే మాట కోవాక్సిన్ అని. కోవాక్సిన్ అందుబాటులో లేదు అంటేనే కోవిషిల్డ్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ కోవిషిల్డ్ పనితీరుపై ఐ.సి.ఏం.ఆర్ సంచలన విషయం తెలిపింది. కోవాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్న తర్వాత యాంటీ బాడీ లు అభివృద్ధి చెందితే కోవిషిల్డ్ సింగల్ డోస్ తోనే ఎక్కువ యాంటీ బాడీ లు అభివృద్ధి చెందాయని ఐ.సి.ఏం.ఆర్ ప్రకటించింది. కోవిషిల్డ్ వాక్సిన్ తీసుకున్న వారికి ఐ.సి.ఏం.ఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. కోవిషిల్డ్ వాక్సిన్ తొలి డోస్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరిగినట్టు గుర్తించామని ఐ.సి.ఏం.ఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రకటించారు. అందుకే రెండు రోజుల మధ్య వ్యవధిని ఆరు వారాల నుంచి మూడు నెలలకు పెంచినట్టు వివరించారు.

కోవిషిల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం వల్ల, శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది అన్నారు. కోవిషిల్డ్ రెండు డోస్ లా మధ్య గ్యాప్ పెంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి అన్నారు. ఐ.సి.ఏం.ఆర్ ఇంకో విషయం కూడా తెలియజేసింది. కోవిషిల్డ్ పని తీరు కూడా ఎనభై ఐదు నుంచి తొంబై శాతం ఉందని అధ్యయనాల్లో తేలింది. పై వీడియో లో పూర్తి సమాచారం చూడవచ్చు.