సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు ఇప్పుడు ప‌ప్పీల‌ను పెంచుకోవ‌డం కామ‌న్‌గా క‌నిపిస్తుంది. మూగ‌జీవాల‌ను ద‌గ్గ‌ర‌కు తీస్తూ వాటిపై ప్రేమ‌ను చాటుకుంటూ ఉంటారు. సెల‌బ్రిటీల సంగ‌తైతే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అవి తమ బిడ్డలేనని ప్రకటిస్తుంటారు. తమ పెట్స్‌కు సంబంధించిన ప‌లు విషయాల‌ను షేర్ చేసుకుంటూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు. త‌మిళ‌న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఓ కుక్క‌పిల్ల‌ని ఎంతో ప్రేమ‌గా పెంచుకుంటూ ఉంది. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన‌ప్పుడు కూడా ఆ ప‌ప్పీని త‌న‌తో పాటు తీసుకెళుతుంది. ఆ మ‌ధ్య సందీప్ కిష‌న్ షూటింగ్ లో పాల్గొనేందుకు చెన్నై నుండి హైద్రాబాద్‌కు పెట్‌ని ఫ్లైట్‌లో తీసుకెళ్లింది.

ఆ స‌మ‌యంలో నా బేబీ గుచ్చి వరలక్ష్మీ మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కాడు. ఎయిర్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు అంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇక తాజాగా త‌న పెట్‌తో రోడ్డుపై స‌ర‌దాగా న‌డుస్తూ సంద‌డి చేసింది. ప‌ప్పీని చూస్తూ మురిసిపోతూ వ‌ర‌ల‌క్ష్మీ హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. వ‌ర‌ల‌క్ష్మీ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటుంది. క్రాక్, నాంది చిత్రాల‌లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు పోషించి అల‌రించింది.