సినిమాల్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో తన అందాలతో రెచ్చిపోయే అనసూయ అప్పుడప్పుడు ఫన్నీ ఫీట్స్ చేస్తూ ఉంటుంది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో బిజీ లైఫ్ గడుపుతున్న ఈ భామ తాజాగా క్రికెట్ ఆడుతూ కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘క్షణం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనసూయ అంతకుముందు యాంకర్ గా అనేక ప్రొగ్రాముల్లో కనిపించిందీ భామ. ఇప్పుడు కూడా కామెడీ షోలో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే బుల్లితెరపై కంటే వెండిలెరపై ఎక్కువగా కనిపిస్తోంది. అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన పర్ఫామెన్ష్ తో ఆకట్టుకుంటోంది. ఆమె చేసే ప్రతి పనికి సంబంధించిన ఫొటో, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది.

తాజాగీ ఈ బ్యూటీ క్రికెట్ ఆడుతూ రచ్చ రచ్చ చేసింది. బ్లూ కలర్ సారీలో క్రికెట్ ఆడుతూ రన్స్ కోసం పరుగులు కూడా తీసింది. అయితే తాను కొట్టిన బాల్ ఓ మహిళకు తాకడంతో షాక్ కు గురైంది. దీంతో ఆమె ఆ మహిళ దగ్గరికి వెళ్లి సారీ చెప్పింది. అయితే అనసూయ క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అవుతోంది. సినిమాలు, టీవీ షోలతో బీజీగా ఉంటే అనసూయ కాస్త విరామం దొరికితే ఇలా ఏదో ఒక ప్రత్యేక పని చేస్తూ అలరిస్తుంది.