కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోరం జరిగింది. కరోనాతో ఓ వైపు ప్రజలు తంటాలు పడుతుంటే, ఓ యువకుడు కరోనా క్వారంటైన్‌ కేంద్రంలోని మహిళపై లైంగిక దాడి చేయడం కలకలం రేపుతోంది. నిందితుడిని ఇప్పటికే స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే నిందితుడు శంకర్ స్థానిక కరోనా క్వారంటైన్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అక్కడ బాత్‌రూమ్ వద్ద ఉన్న ఓ మహిళపై లైంగికదాడి చేయబోయాడు. దీంతో ఆమె ప్రతిఘటించి బాధితురాలు అక్కడి నుంచి పారిపోయింది. ఇతర మహిళలు రక్షించాలని పెద్ద ఎత్తున కేకలు వేయండంతో అక్కడున్న వారు శంకర్ ను అడ్డుకుని అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు. కాగా, గదిలో ఉన్న బాధితురాలి స్వస్థలం ముంబై అని, ఆమె బెంగళూరు వచ్చి ప్రభుత్వం నిర్ధేశించిన క్వారంటైన్‌లో ఉంటోంది.