ఓ వలస కూలీకి నడవలేని వికలాంగ కొడుకు, వందలమైళ్ళు కాలినడక దారిలో ఒక ఇంటి ముందు సైకిల్ కనపడింది. దొంగతనం చేయను మనసొప్పలేదు. కానీ తిండి, నిద్రలేకుండా ఎర్రటి ఎండలో నడవలేని బిడ్డను మోయలేక సైకిల్ చోరీ చేశాడు. అక్కడే ఒక పేపర్ పై ఆ విషయం రాసి క్షమించమని కోరాడు. సైకిల్ పోగొట్టుకున్న వ్యక్తికి లేఖ చదివాక ఏడుపొచ్చింది. రాజస్థాన్ నుంచి రాయబరిలీ పోతున్నామని అందులో రాశాడు.

లేఖ

“నమస్తే జీ ! విధిలేని పరిష్టితుల్లో నేను మీ సైకిల్ తీసుకెళ్తున్నా. నేను బరేలి వెళ్ళాలి. నాకో కుమారుడు ఉన్నాడు. అతను నడవలేడు. అతని కోసమే ఈ పని చేయాల్సి వచ్చింది. మీకు కుదిరితే నన్ను క్షమించడండి. ఇంతకు మించి నాకు మరో దారి లేదు” అని రాశాడు. సైకిల్ కోల్పోయిన వ్యక్తి ప్రభు దయాల్ ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. సైకిల్ లేకుంటే అతనికి జీవనం నడవదు. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాడు. కానీ, లేఖను చూసిన తరువాత దయాల్ మనసు కరిగిపోయింది. తనకంటే కష్టాల్లో ఉన్న వ్యక్తికి తన సైకిల్ ఉపయోగపడినందుకు సంతోషించాడు…