ఎంపీ నవనీత్ కౌర్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో నాగ్ పూర్ లోని దవాఖానకు తరలించారు. కౌర్ కుటుంబంలోని భర్త, పిల్లలు, అత్తమామలతో సహా కుటుంబంలోని 12 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ అని తేలడంతో అమరావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌర్ ని మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. కరోనా బారిన పడ్డామని కౌర్, భర్త రవి రానా సోషల్ మీడియాలో ధృవీకరించారు. తమను కలిసిన వారిని క్వారంటైన్ ఉండమని, చికిత్స చేయించుకోమని సూచించారు. నటిగా కెరీర్ ను ప్రారంభించిన కౌర్ పలు తెలుగు చిత్రాల్లో నటించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆమె భర్త రవి యువ స్వాభిమాన్ పార్టీ నాయకుడు. ఆయన బద్నేరా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.