ఖననం చేసిన శవాన్ని, బంగారు ముక్కుపుడకల కోసం తవ్వి తీశారు. ఈ దారుణ ఘటన గురువారం మెదక్‌ పట్టణంలో చోటు చేసుకుంది. గోల్కొండ వీధికి చెందిన కొప్పుల పోచమ్మ(80) గత నెల 24న అనారోగ్యంతో మృతి చెందింది. స్థానిక గిద్దకట్ట శ్మశాన వాటికలో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడి కాటికాపరి యాదగిరి సంబంధీకులు ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి రెండు ముక్కు పుడకలు తీసుకున్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుమారుడు ఊశయ్య పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.