ఆమె తిడుతూ డైలాగ్‌ చెబితే నవ్వుల పువ్వులు పూయాల్సిందే, అనర్గళంగా మాట్లాడుతూ, నటిస్తోంటే ఎంతటి వారైన ముగ్ధులవ్వాల్సిందే. ఆమే 58 ఏళ్ల మై విలేజ్‌ షో గంగవ్వ. సహజ నటనతో యూట్యూబ్‌ ప్రేక్షకుల మనసులు దోచేస్తున్న ప్రతిభావని. గంగవ్వ ఊరు జగిత్యాల జిల్లా లంబాడిపల్లి ఆమెకు పదేళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారు. ఇద్దరు తమ్ముళ్లు. మేనత్త గంగవ్వను పెంచితే, ఆమె పెద్ద తమ్ముడి బాధ్యత అమ్మమ్మ తీసుకుంది. చిన్నతమ్ముడు యాదవుల ఇళ్లల్లో పెరిగాడు.