చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలోని మోగిలివారిపల్లిలో ఏనుగుల శ్రద్ధాంజలి గ్రామస్తులను, అటవీశాఖ అధికారులు కంటతడి పెట్టించింది. మొన్న రాత్రి కరెంట్ షాక్ తో చనిపోయిన ఏనుగును వర్షాల వల్ల రైతు పొలంలోనే పూడ్చిపెట్టారు. మంగళవారం తెల్లవారుజామున 17 ఏనుగులు ముందు రోజు తమతో వచ్చి చనిపోయిన ఏనుగును పూడ్చిపెట్టిన ప్రదేశం వద్దకు వచ్చాయి. పూడ్చిన చోట చుట్టూ నిలబడి పెద్దగా ఘీంకారం చేశాయి. సమాధిపై కాళ్లతో తొక్కాయి. కన్నీళ్లు పెట్టుకున్నాయి. చనిపోయిన ఏనుగుకు శ్రద్ధాంజలి ఘటించేందుకు గుంపులో మిగిలిన ఏనుగులు వస్తాయని తెలిసిన అటవీశాఖ అధికారి మదన మోహన రెడ్డి , ఏనుగులు మళ్ళీ కరెంట్ షాక్ కు గురికాకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయించారు.. మనుషుల్లో లేని ప్రేమను, చనిపోయిన సహచర ఏనుగుపై చూపిన వాటి విశ్వాసానికి గ్రామస్తులు చలించి పోయారు…..