ప్రతి రోజు భర్త స్నానం చేయడం లేదు, గడ్డం గీసుకోవడంలేదని విడాకులు కావాలని భార్య కోర్టులో కేసు వేసిన సంఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది.

మహిళ కమిషన్ సభ్యురాలు ప్రతిమ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం: 2017లో సోని దేవి అనే యువతి మనీష్ రామ్‌ను పెళ్లి చేసుకుంది. భర్త ఇంట్లో శుభ్రంగా ఉండడం లేదని, బ్రష్ సరిగ్గా చేసుకోవడం లేదని, స్నానం చేయడం లేదని, గడ్డం గీసుకోవడంలేదని సోని మహిళా కమిషన్‌ను కలిసి తనకు భర్తతో విడాకులు కావాలని కోరింది.

దీంతో మహిళ కమిషన్ సభ్యులు అవాక్కయ్యారు. పిచ్చి కారణాలతో భర్తను వదించుకోవాలని సదురు మహిళ చూస్తోందని కమిషన్ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త మనీష్ మాత్రం తన భార్యతో కలిసి ఉంటానని తెలిపాడు. దంపతులను కలిసి ఉండేందుకు కౌన్సిలింగ్ ఇస్తామని ప్రతిమా తెలిపారు. పెళ్లిలో మనీష్ కు బంగారం, డబ్బులు, కట్న కానుకల కింద ఇచ్చామని అవి ఇప్పించాలని మహిళా కమిషన్ ను భార్య కోరింది.