నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే మలుపులు ప్రశాంతతను పంచుతున్నాయని ప్రమాదకర రహదారులు. మిన్నకుండి పోయాయని, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ పరిణామంతో అనూహ్యమైన ఫలితం కనిపిస్తుందని. ఇది తాత్కాలికమే అయినా ప్రమాదాలు మాత్రం తగ్గడం విశేషమని, అతికొద్ది వాహనాలు మాత్రమే రహదారులపై తిరుగుతుండగా అడపదడప ప్రమాదాలు జరుగుతున్నాయని .. లాక్ డౌన్ ముందు వరకు మెదక్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండేవని, కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వాలు చేపట్టిన లాక్ డౌన్ నిబంధనల ప్రభావం వలన జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య గణినీయంగా తగ్గిపోయిందని, జిల్లా పరిధిలో రామాపంపేట్ నుండి కాళ్ళకల్ వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తూ రక్తమోడుతూ కనిపించేవని, మితిమీరిన వేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలను నడపడం కారణంగా అనేక ప్రమాదాలు సంభవించేవని, ప్రస్తుతం కరోన మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా

మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూ 23వ తేదీ నుంచి వరుసగా లాక్ డౌన్ అమలు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తద్వారా అత్యధిక భాగం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు, జిల్లా పోలీసు యంత్రాంగం లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేయడంతో తాత్కాలికంగా ప్రజలు తమ వాహనాలతో రోడ్డుపై రావడం మానేశారని జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి. ఐ.పి.ఎస్. గారు తెలిపారు.
జనవరి నెల నుండి మార్చ్ 22 వరకు రోడ్డు ప్రమాదాల సంఖ్య
జిల్లాలో లాక్ డౌన్ ముందు వరకు అనగా ఈ సంవత్సరం జనవరి నెల నుండి మార్చ్ 22 వరకు 135 ప్రమాదాలు జరిగి 83 మంది మరణించగా, 144 మంది క్షతగాత్రులు కాగా.

గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాల సంఖ్య:

కరోన వ్యాది ప్రభలి లాక్ డౌన్ విదించిన తర్వాత గడిచిన 48 రోజుల్లో 20 ప్రమాదాలు జరిగి, అందులో 09 మంది మృతి చెందగా 18 మంది క్షతగాత్రులు అయ్యారని తెలిపినారు. ఇది వరకు జాతీయ రహదారిపై రోజులో ప్రతి నిత్యం దాదాపు కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య మూడంకెలు దాటడం లేదు, జిల్లాలోని మిగిలిన రహదారుల పరిస్థితి కూడా అదేవిధంగా వున్నది. జిల్లా కేంద్రం సహా తూప్రాన్ సర్కిల్, నర్సాపూర్ సర్కిల్, రామాయంపేట సర్కిల్, అల్లాదుర్గం సర్కిల్ పరిదిలోని ప్రాంతాల ప్రజలు వారి పరిధిల్లో వివిధ అవసరాల నిమిత్తం ఎక్కువ సంఖ్యలో వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. అది కూడా మధ్యాహ్నం వరకు మాత్రమే కొనసాగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

పలు రకాల వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించాయి ద్విచక్ర వాహన చోదకులు పరిమితంగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గి పోయింది. ఆసుపత్రి సేవలు నిత్యావసరాలు ప్రభుత్వ శాఖల అధికారులు ఇతర అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నామని మరోవైపు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా ఇప్పటి వరకు లాక్ డౌన్ నిబందనలను ఉల్లంఘించిన వారి పైన 403 కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, వీటిలో 1992 ద్విచక్ర వాహనాలు, 161 ఆటోలు, 34 కార్లు, 24 లారీలు ఉన్నాయని జిల్లా ఎస్.పి. గారు తెలిపారు.