కొంధమాల్ జిల్లా బెల్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని అమూల్య ప్రధాన్‌ను (23) పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్కూల్ లో పాఠాలు చెబుతుండగా ఎనిమిదో తరగది విద్యార్థిని కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే ప్రభుత్వ పాఠశాల నిర్వహకులు బాలికకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా నాలుగు నెలల గర్భిణీ అని తేలింది. దీంతో ప్రధానోపాధ్యాయుడు బెల్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడు అమూల్య ప్రధాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమూల్య ప్రధాన్ తుమడి బంద్ కాలేజీ డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్నాడు..