కరోనాతో కళ్ళు మూసేముందు గర్భవతిగా ఉన్న ఓ డాక్టర్ ఇచ్చిన వీడియో సందేశం వింటే కన్నీరు కార్చాల్సిందే, ఆమె చనిపోయే ముందు మన అందరినీ ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పి మరీ, ఈ లోకం నుంచి సెలవు తీసుకుంది. ఒకవైపు ప్రాణం పోతుందని తెలిసినా కరోనాని తేలిగ్గా తీసుకోవద్దని మీకోసం, మిమ్మల్ని నమ్ముకున్నవారి కోసం మాస్కులు లేకుండా తిరగొద్దని కోరింది. ఈ సందేశాన్ని ఆమె భర్త రవీష్ చావ్లా ట్విట్టర్ లో పంచుకున్నారు. డాక్టర్ డింపుల్ అరోరా చావ్లా చివరిగా చెప్పిన మాటలివి.