గర్భిణీ పై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. మూడు రోజుల పాటు తనను బంధించి నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రం​లోఈ ఘటన జరిగింది. రెండు నెలల గర్భిణి అయిన మహిళ శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో మంగళవారం (ఆగస్టు 16) బరేలీ జిల్లా నుంచి బస్సులో బయలుదేరి సహరాన్‌పూర్‌కు వెళ్తుండగా ఫరూఖాబాద్‌లోని బస్‌ టెర్మినల్‌ నుంచి నలుగురు యువకులు తనను కిడ్నాప్ చేసి పొరుగున ఉన్న హర్దోయ్ జిల్లాకు తీసుకెళ్లి. ఓ గదిలో బంధించి మూడు రోజుల పాటు అత్యాచారం చేశారని తెలిపింది. గర్భవతిని నన్ను వదిలేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదని తెలిపింది. శుక్రవారం నిందితులు నిద్రపోతుండగా వారి నుంచి తప్పించుకుని 12 కిలోమీటర్లు నడిచి ఓ గ్రామానికి చేరుకున్నట్లు తెలిపింది. అక్కడ గ్రామస్థులకు జరిగిందంతా చెప్పినట్లు తెలిపింది. అనంతరం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఒక పోలీసు బృందం మహిళను బందీగా ఉంచినట్లు ఆరోపించిన ఇంటికి చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న ఒక మహిళ… బాధిత మహిళ యొక్క బంధువులే రూ. 80,000 కోసం ఆమెను అక్కడ వదిలివెళ్లారని పేర్కొన్నారు. ఫరూఖాబాద్ బస్ టెర్మినల్ వద్ద నిందితుడు తన వద్దకు వచ్చినట్లు నిందితుడు మత్తుమందులు వేసిన గుడ్డని తన ముఖం దగ్గర ఉంచడంతో స్పృహతప్పి పడిపోయాను అని బాధితురాలు చెప్పిందని ఫరూఖాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అశోక్ కుమార్ మీనా తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, తాను ఒక ఇంటి గదిలో కనిపించినట్లు ఆ మహిళ చెప్పిందని పక్కనే కూర్చున్న నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామని బెదిరించారు అని బాధిత మహిళ చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. తాను బందిఖానాలో ఉన్నప్పుడు మూడు రోజులు తినడానికి ఆహారం కూడా ఇవ్వలేదని ఆ మహిళ ఆరోపించినట్లు ఎస్పీ తెలిపారు. ఫరూఖాబాద్, హర్దోయ్ పోలీసులు మహిళను విచారిస్తున్నారని, దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ చెప్పారు.