ఈ మద్య హీరో, హీరోయిన్లు పాశ్చాత్య పోకడలకు పోతున్నారు. డేటింగ్ కల్చర్ కి బాగా అలవాటు పడుతున్నారు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు సహజీవనం చేసుకోవడం ఇష్టమైతే పెళ్లి లేదంటే బ్రేకప్. మరికొంత మంది సెలబ్రెటీలు తాము ప్రెగ్నెన్సీ ఉన్నా ఆ విషయాన్ని చాలా గుట్టుగా దాయడం పాపో, బాబో పుట్టిన తర్వాత ఆ గుట్టు విప్పడం కామన్ అయ్యింది. ఆ మద్య కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని తెగ హల్ చల్ చేసిన కన్నడ బ్యూటీ ప్రముఖ హీరోయిన్ శృతి హరిహరన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
కన్నడ, మలయాళీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 30 ఏళ్ల ఈ నటి గత ఏడాది మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున పాల్గొన్న శృతి సీనియర్ హీరో అర్జున్ తనని లైంగికంగా వేధించాడంటూ ఫిర్యాదు చేసింది. అప్పటి వరకు శృతి హరిహరన్ కు పెళ్ళైన సంగతి ఆమె సన్నిహితులకు తప్ప మరెవరికీ తెలియదు.

దానికి కారణం శృతికి వివాహం జరిగిందని తెలిస్తే ఛాన్సులు పెద్దగా రావని ఆమె ఇలా చేసిందని అప్పట్లో తెగ విమర్శలు వచ్చాయి.
రామ్ కుమార్ అనే రచయితని ఆమె రహస్య వివాహం చేసుకుంది. నాలుగేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన తర్వాత ఈ జంట వివాహం చేసుకుంది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను నిండు గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన పుట్టబోయే బిడ్డని ఉద్దేశిస్తూ నా జీవితం ఇప్పుడు నీ గుండె చప్పుళ్లతో నెలకొంది. ప్రపంచమనే సర్కస్ లోకి నిన్ను ఆహ్వానిస్తున్నా. నిన్ను చూసేందుకు ఎక్కువ కాలం ఎదురుచూడలేను అంటూ శృతి హరిహరన్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. సినీ పరిశ్రమలో ఏ నిజం కూడా ఎప్పటికీ దాగదు చెప్పుకోవడమే బెటర్ అనుకుందో ఏమో శృతి కూల్ గా గుట్టు విప్పింది.