సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి లోని గోకుల్ నగర్ లో ప్రజల భాగస్వామ్యంతో నెలకోల్పబడిన సి.సి కెమెరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సొమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నెలకొల్పబడిన పనితీరుపై సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఒక్క సి.సి కెమెరా వంద మంది పోలీసులతో సమానం, సి.సి కెమెరాలతోనే నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించి సి.సి కెమెరాల దృష్యాలధారంగా నేరస్తులకు శిక్షపడేందుకు సి.సి కెమెరాలు దోహడపడుతాయి. ముఖ్యంగా సి.సి కెమెరాలు వున్నప్రాంతాల్లో నేరాలు తగ్గుముఖం పడటంతో నేరాలు చేసేందుకు నేరస్తులు భయపడుతున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, సుబేదారి ఇన్స్ స్పెక్థర్ రాఘవేందర్ మరియు కాలనీ వాసులు పాల్గోన్నారు.