భారత బాడ్మింటన్ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కారణంగా తన కెరీర్ నాశమైనదని ప్రముఖ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆరోపించారు. ‘నేను ఎదుర్కొన్న వేధింపులకు ఆయనే కారణం. ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెప్పగలను. బ్యాడ్మింటన్ లో నా సత్తా ఏంటో ఆయనకు తెలుసు. నాకు మద్దతుగా ఉంటాడని భావించాను. కానీ, నాతో కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆయన ఆడేవారు.’ అని జ్వాలా అన్నారు.

ఒకప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్లు మన రాష్ట్రం నుంచి వచ్చేవారు కాదు. కానీ, గత పదేళ్లుగా హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీ నుంచే వస్తున్నారని గుత్తా జ్వాల తెలిపింది. గోపీచంద్ అకాడమీ వారికైతేనే గుర్తింపు వస్తుందని చెప్పారు. మన దేశానికి పతకం వస్తే గోపీచంద్ వల్ల వచ్చినట్టు చెప్పుకుంటారని, రాకపోతే ఇతరుల మీదకు నెట్టేస్తారని అన్నారు. 2004లో గుత్తా జ్వాల, గోపీచంద్ ఇద్దరూ కలిసి మిక్స్ డ్ డబుల్స్ లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.