గుడ్డివాళ్లూ.. ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపుతారా? అంటూ సీనియర్ సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ మండిపడ్డారు. ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. గోమూత్రం, పేడతో కరోనా వైరస్‌‌ను నయం చేయవచ్చు అంటూ చేస్తున్న ప్రచారంపై ఆమె స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు. గుడ్డివాళ్లూ ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్నీ రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపుతారా?’ అంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు.