గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలో 60లక్షల వ్యయంతో నిర్మించనున్న రామాలయం సిసి రోడ్డు మరియు సైడ్ డ్రైన్ అలాగే 35లక్షలతో నిర్మించనున్న గౌడ కాలనీ సిసి రోడ్డు మరియు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు మొత్తం 85లక్షల పనులకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను శిభారాణి అనిల్, పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ ప్రెసిడెంట్ నేరళ్ల రాజు, బుద్ధ శ్రీను, బుద్దె వెంకన్న డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.