{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584349797620","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1584349664446","source":"other","origin":"unknown"}

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:

మెదక్‌ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామం నుంచి ఏడుపాయలకు ఓ శుభకార్యానికి బంధువులతో వస్తున్న డీసీఎంను ఢీకొంది. ఈ ఘటనలో డీసీఎంలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.