మెదక్ జిల్లా కొల్చారం నర్సరీ సమీపంలో బైక్ పై నుంచి పడి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. సర్దన గ్రామానికి చెందిన నవీన్ -సావిత్రి దంపతులు బైక్ పై వెళ్తుండగా చీర కొంగు బైక్ చక్రంలో ఇరుక్కోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది, తలకు తీవ్ర గాయాలు కావడంతో సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త కళ్లలేదుటనే భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో భర్త నవీన్,కొడుకు జితేందర్ శోక సముద్రంలో మునిగిపోయారు.