‌మిడ్జిల్ మండలం కొత్తపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే 9 మంది కూలీలు మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 15కు చేరింది. పనులు ముగించుకుని తిరిగి ఇళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రమాదంపై సీఎం కెసిఆర్ తీవ్ర దిగ్బ్రాంతి

 మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మిడ్జిల్‌ మండలం కొత్తపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఆటోలో మొత్తం 16 మంది ఉన్నట్లు సమాచారం. రోడ్డుపై వెళ్తున్న వారు కూడా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మృతులు కొత్తపల్లి, గోగ్యా తండా వాసులుగా గుర్తించారు