{"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595236084252","subsource":"done_button","uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1595236054191","source":"other","origin":"unknown"}

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు తెలుగుదేశం నేత ఆందోళనకు దిగడం చర్చ కు దారితీసింది. గత కొన్ని రోజులుగా బాబు ఫై సొంతపార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నాయకత్వం మారితే కానీ తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం రాదని చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు సోమవారం చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు తనను రాజకీయంగా 30 ఏళ్లగా వాడుకొని వదిలేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌గా వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. తన సమస్యలను చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు సమయం ఇవ్వడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంకటేశ్వరరావు బాబు ఇంటిముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.