హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. రెండ్రోజుల కిందట కరోనాతో ఆ ఆసుపత్రిలో బాధిత మహిళ చేరింది. చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు విడిచింది. మృతురాలి శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాల చెవి కమ్మలు మాయం అయినట్లు బంధువులు ఆరోపించారు. ముక్కుపుడక కూడా మాయమైనట్లు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.