గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన అత్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: గుంటూరులోని తెనాలిలో నివాసం ఉంటున్న కోడలు ప్రియాంక తన అత్త తలపై చపాతీ కర్రతో బలంగా కొట్టింది. దీంతో అత్త మైధిలి అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అత్త వేధింపులు భరించలేకే కోడలు ప్రియాంక ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని​ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.