ప్రజలకు మంచి, చెడు చెప్పాల్సిన ఓ పాస్టర్ పాడుపని చేశాడు. చర్చి పేరుతో ఉన్న బంగ్లాలో అమ్మాయిలతో లైంగిక కార్యకలాపాలు నిర్వహించడం పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వెలుగుచూసింది. వివరాలు: కన్యాకుమారి జిల్లా ఎస్టీ మంగడుకు చెందిన లాల్ షైన్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి పాస్టర్‌గా ఉన్నాడు. అదే ప్రాంతంలోని తన లగ్జరీ బంగ్లాలో ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో చర్చిన నడుపుతున్నాడు. ఇది కన్యాకుమారిలో ఉన్న పేరున్న చర్చిలలలో ఒకటిగా ఉంది. అయితే పాస్టర్‌గా ఉన్న షైన్ సింగ్ ఈ చర్చిలో పాడుపనులు నిర్వహిస్తున్నాడు. కేరళతోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. తరుచూ ఈ చర్చి వద్దకు లగ్జరీ కార్లలో అమ్మాయిలు, పురుషులు రావడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వారంతా మోడ్రన్ డ్రెస్సులు ధరించేవారు.

అయితే చర్చి పేరుతో ఉన్న బంగ్లాలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు పక్కా ప్లాన్‌తో అక్కడ దాడులు చేసేందుకు సిద్దమయ్యారు. దాదాపు 15 మంది వరకు పోలీసులు చర్చి పేరుతో ఉన్న లగ్జరీ బంగ్లాపై దాడి చేశారు. ఆ సమయంలో బంగ్లాలోని వేర్వేరు గదుల్లో శృంగారం చేస్తున్న మహిళలు, పురుషులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు యువతులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఓ 19 ఏళ్ల యువతిని ఆమె తల్లే వ్యభిచార కూపంలోకి నెట్టిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక, ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. చర్చి పేరుతో ఆ బంగ్లాలో జరుగుతున్న బూతు బాగోతం బయటపడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.