నిజామాబాద్‌ జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేటలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల ఇద్దరు చిన్నారులపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం: జానకంపేటకు చెందిన నారాయణ(55) గత 15 రోజులుగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ల ఆశ చూపుతూ గ్రామంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దని చిన్నారులను బెదిరించారు. చిన్నారులకు నొప్పి పుట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ కామాంధుడిని బంధించి గ్రామస్తులు దేహశుద్ది చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చిన్నారులను చికిత్స నిమిత్తం బోధన్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.