కోడి చంపేసి ముక్కలుగా నరికిన తరువాత ఆ ముక్కకు ప్రాణం వచ్చింది, ప్లేట్ లోంచి ఎగిరి ఎగిరెగిరి పడింది ! ఏంటీ జోకా? చచ్చిపోయిన కోడి భోజనం ప్లేట్ లోంచి ప్రాణం వచ్చి ఎగరటమేంటి? అనుకుంటున్నారా? నిజంగా నిజం. ఫ్లోరిడాకు చెందిన రియా ఫిలిప్స్ అనే యువతి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఔరా ఏమిటీ చిత్రం అంటు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. కోడిని కోసి ప్లేట్ లో వేసి ఆ ప్లేటు ను ఓ టేబుల్ పై పెట్టారు. కాసేపటికి ప్లేట్ లో ఓ చికెన్ ముక్కలో అకస్మాత్తుగా కదలిక వచ్చింది. అలా ప్లేట్ లోంచి ఎగిరి బల్ల పైకి దూకింది. కాగా కొన్నిసార్లు కోడిని ముక్కలుగా చేసినా వాటి కండరాల్లో జీవం ఉంటుందని కొన్ని సమయాల్లో అవి ముందుగానే మెదడు నుంచి గ్రహించిన సంకేతాలను ముక్కలైన తర్వాత కూడా కొనసాగిస్తాయని కొంతమంది విశ్లేషకులు పేర్కొంటున్నారు..