సినిమా ఆర్టిస్టుల అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ సభలో రసాభసా జరిగింది. చిరంజీవి, రాజశేఖర్‌లు లైవ్ కార్యక్రమంలోనే ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మాట్లాడుతున్న సమయంలో ప్రోటోకాల్ పాటించకుండా మైక్ లాక్కొవడం సరైనది కాదని చిరంజీవి సీరియస్ అయ్యారు. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో రాజశేఖర్‌ పదే పదే అడ్డుకోవడంతో ఈ వివాదానికి దారితీసింది.

మంచి ఉంటే అందరి ముందు చెప్పండి.. చెడు అయితే చెవిలో చెప్పండి అంటూ చిరంజీవి మా విబేదాలపై తనదైన శైలిలో చురకలంటించారు. మా అసోసియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌ను చిరంజీవి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయటంతో అసలు వివాదం మొదలైంది.మా అసోసియేషన్ గురించి చిరంజీవి మాట్లాడిన అంశాలపై రాజశేఖర్ ప్రస్తావించారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు ఉన్నా అందరూ కలిసి పోవాలని చిరంజీవి చెప్పారని, అందరూ కలిసి నడవాలి.

ప్రజాస్వామ్యం అనేది ఇలానే ఉంటుందని ఆయన బ్రహ్మండంగా మాట్లాడరని అంటూనే ఇండస్ట్రీలో నిప్పు రాజేసుకుందంటూ రాజేశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. నిప్పును కప్పి పుచ్చినంత మాత్రానా పొగ రాకుండా ఉండదని ఆయన అన్నారు. తన కుటంబంలో కూడా విభేదాలు వచ్చాయని చెప్పారు. అందుకే తనకు కారు ప్రమాదం కూడా జరిగిందని విమర్శించారు. రాజశేఖర్ మైక్‌ను అక్కడున్న వారు కూడా లాక్కోవటంతో రాజశేఖర్ అలిగి వెళ్లిపోయారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.