కూకట్‌పల్లి వై జంక్షన్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యాదగిరి. ఈ నెల 21న తమ షాప్‌కి వచ్చిన ఓ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వస్త్ర దుకాణాల్లో షాపింగ్ చేసే మహిళలకు వారు సెలెక్ట్ చేసుకున్న చీరను కట్టి చూపించడానికి ప్రత్యేక మహిళా సిబ్బంది ఉంటారు.అయితే కొన్ని షాప్స్‌లో పురుషులే ఈ పనిచేస్తున్నారు. ఇదే అదనుగా కొంతమంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా ఇలాంటి కేసులోనే బుక్కయ్యాడు హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన యాదగిరి(27) అనే వ్యక్తి. కూకట్‌పల్లి వై జంక్షన్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యాదగిరి. ఈ నెల 21న తమ షాప్‌కి వచ్చిన ఓ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు విద్యార్థి ఓ చీరను సెలెక్ట్ చేసుకోగా కట్టి చూపిస్తానని చెప్పి యాదగిరి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా మెజిస్ట్రేట్ నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది.