ఇది కలెక్టరేట్‌ కార్యాలయం జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా అలాగే జిల్లాలో స్వచ్ఛభారత్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాలన్నా ఈ కార్యాలయం నుంచే జరుగుతుంది. అలాంటి కలెక్టరేట్‌లో స్వచ్ఛత కరవై పారిశుద్ధ్యం కనుమరుగైంది. కలెక్టరేట్‌ పరిసరాలు వర్షం నీటితో, పిచ్చి మొక్కలతో నిండిపోయి దోమలు, విష పురుగులు వచ్చే అవకాశం ఉంది. నిత్యం వందలాది మంది ప్రజలు తమ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు దోమలు, విషపురుగుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కలెక్టరేట్‌లోనే స్వచ్ఛత ఈ స్థాయిలో ఉంటే ఇక గ్రామాల్లో ఎలా ఉంటుందోనని ఇక్కడికి వచ్చిన ప్రజలు అనుకుంటున్నారు.