తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ నేతన్నలను ఆదుకోవడానికి “నేతన్నలకు చేయూత”, “చేనేతమిత్ర” లాంటి పథకాలను ప్రవేశపెట్టి చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపారని అన్నారు. నూలు రసాయనాలపై సబ్సిడీనీ అందిస్తూ మౌలిక మార్కెటింగ్ సదుపాయాలను కల్పించి దేశంలోనే చేనేత కార్మికుల కష్టాలను గుర్తించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆచార్య “కొండా లక్ష్మణ్ బాపూజీ” పేరిట చేనేత కార్మికులకు అవార్డులను ప్రకటించి వారిని గౌరవిస్తున్నారని గుండు సుధారాణి అన్నారు. ప్రస్తుత కరోన లాక్ డౌన్ వలన చేనేత పరిశ్రమలు స్థంబించి పోయినందున, ఉపాది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశానుసారం రాష్ట్ర చేనేత జౌలి శాఖా మంత్రి కేటిఆర్ గారు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారని అన్నారు.

నేతన్నలకు చేయూత పథకం క్రింద 3సం.ల లాక్ ఇన్ పీరియడ్ ఉన్నా కూడా అంటే గడువు పూర్తికాకున్నా కూడా రాష్ట్రం లోని 26500 మంది కార్మికులకు 93 కోట్ల రూపాయలను, గడువు పూర్తయిన 2337 మంచి కార్మికులకు 1కోటి18లక్షల రూపాయలను అందించి అండగా నిలిచారన్నారు. మంత్రి KTR సూచన మేరకు లాక్ డౌన్ సమయంలో వరంగల్ కొత్తవాడలోని వెయ్యి మంది చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులను అందించామని తెలిపారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులకు, తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, శ్రీమతి. గుండు సుధారాణి గారు “జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు” తెలియజేసారు…