సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ సుధారాణి విజ్ఞప్తి

వరంగల్ : రాష్ట్రంలో చేనేత రంగాన్ని గట్టెక్కిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ , తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరే షన్ చైర్ పర్సన్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు వరంగల్ లోని కొత్తవాడ చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్ గారికి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

లాక్ డౌన్ వల్ల అమ్మకాలు నిలిచిపోయి రాష్ట్రంలోని చేనేత సంఘాల వద్ద పెద్ద మొత్తంలో ఉత్పత్తులు పేరుకుపోగా, కార్మికులకు ఉపాధి కరువైందని పేర్కొన్నారు . ఈ కష్టకాలంలో చేనేత సంఘాల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు రూ.200 కోట్లు నిధులు కేటాయించడంతో పాటు సబ్సిడీపై నూలు అందించి కార్మికులను ఆదుకోవాలని ఆమె ఆ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు .