చైనా వస్తువులను ప్రజలను కొనకండి అని అనేకంటే, ప్రభుత్వం తానే దిగుమతులు నిషేధించాలని డిమాండ్ చేసేవాళ్లకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్.

భారతదేశం 1995 లో WTO (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) లో చేరే విధంగా అగ్రిమెంట్ సంతకం చేసినందువలన భారత ప్రభుత్వం తనంతట తాను ఆ అగ్రీమెంటు లో సంతకం చేసి ఉన్న ఇతర దేశాల వస్తువులు నిషేదించలేదు,అలాగే వాళ్ళు కూడా మన వస్తువులను నిషేదించలేరు. అలా చేస్తే అంతర్జాతీయంగా మన మీద ఎన్నో ఆంక్షలు విధింపబడతాయి. కానీ ఒకవేళ ప్రజలు కొనకపోతే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు. ఈ మధ్య మలేసియా నుండి పామాయిల్ దిగుమతి కూడా ప్రభుత్వం ఆఫీషియల్ నిషేదించలేదు, కేవలం మన ఆయిల్ ఇంపోర్టర్స్ వద్దనుకుని ఆపేశారు, ఒకవేళ ప్రభుత్వం డైరెక్ట్ గా చేసివుంటే చాలా ప్రాబ్లమ్ వచ్చేయి. ప్రభుత్వాన్ని ఆపడానికి అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి ప్రజలను ఆపడానికి ఏవీ లేవు కాబట్టి ప్రజలు వద్దనుకుంటే ఏ చైనా వస్తువులూ రాలేవు. దయచేసి గమనించండి. ప్రభుత్వానికి చాలా అంతర్జాతీయ అడ్డంకులు ఉంటాయి , ప్రజలకు ఏమీ ఉండవు.