సమంత తన గ్యాంగ్ తో కలిసి ఇప్పటికే గోవా చేరుకుంది

ఎంత బిజీగా ఉన్నప్పటికీ న్యూ ఇయర్ ను మాత్రం మిస్ అవ్వరు నాగచైతన్య-సమంత. దీనికోసం దాదాపు 2 నెలల ముందు నుంచే తమ కాల్షీట్లన్నీ సర్దుబాటు చేసుకుంటారు. ఈసారి కూడా ఈ జంట న్యూ ఇయర్ పార్టీకి రెడీ అయింది. ఎప్పట్లానే ఈసారి కూడా కొత్త సంవత్సరానికి గోవా వేదికగా స్వాగతం పలకబోతోంది ఈ జంట అటు చైతూ, ఇటు సమంత ఇద్దరికీ గోవా అంటే చాలా ఇష్టం.

ఎన్ని దేశాలు తిరిగినా గోవాలో ఉన్న కంఫర్ట్ వీళ్లకు ఎక్కడా దొరకలేదు. అంతెందుకు, పెళ్లి కూడా గోవాలోనే చేసుకున్నారు. ప్రతి న్యూ ఇయర్ పార్టీని గోవాలోనే సెలబ్రేట్ చేసుకున్నారు. అలా ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ కు గోవానే సెలక్ట్ చేసుకున్నారు చై-శామ్. సమంత తన గ్యాంగ్ తో కలిసి ఇప్పటికే గోవా చేరుకుంది. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య కూడా వీలైనంత త్వరగా గోవా వెళ్తాడు. సో.. 4 రోజుల పాటు గోవాలోనే మకాం పెట్టింది ఈ జంట.