హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) గౌరవంగా ఇచ్చే జీతభత్యాలని తీసుకోనని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ నుంచి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చారు.

శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలని, ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థికభారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఛైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉదారంగా తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ అధికారులు, సూపర్‌వైజర్లు ఉద్యోగులు హర్షం వక్తం చేశారు..